Aug 26,2023 22:53

ప్రారంభిస్తున్న నారాయణరావు

* జిల్లా పర్యాటక అధికారి నారాయణ రావు
ప్రజాశక్తి- శ్రీకాకుళం : 
ప్లాస్టిక్‌ నిషేధించి, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా పర్యాటక అధికారి ఎన్‌ నారాయణ రావు అన్నారు, శనివారం స్థానిక మహిళా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో యువ క్లబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ ఆదేశాలమేరకు ప్రైవేటు కళాశాలలో కూడా ఈ క్లబ్బులు ప్రారంభించామన్నారు. . ప్లాస్టిక్‌ నిషేధం, వాటివల్ల కలిగే అనర్ధాలను తెలియజేశారు. సైకిల్‌ తొక్కడం, మట్టి పాత్రలు వాడడం, ఇంటిదగ్గర తయారుచేసిన వంటను తినడం ఆరోగ్యానికి మంచిదని వివరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కళాశాల ప్రిన్సిపల్‌ ఎం. కష్ణవేణి మాట్లాడుతూ యువ క్లబ్‌ల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్య ఉప సంచాలకులు, కళాశాల లెక్చరర్లు రాజేశ్వరి, అప్పారావు, కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.