Aug 24,2023 22:16

సేకరించిన ప్లాస్టిక్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌

ప్రజాశక్తి-హిందూపురం : హిందూపురం పురపాలక సంఘ వ్యాప్తంగా ప్లాస్టిక్‌ నిషేధాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ ప్రమోద్‌ కుమార్‌ అన్నారు. గురువారం పురపాలక సంఘ వ్యాప్తంగా సచివాలయ శానిటేషన్‌, ఇన్వీరాల్‌మెంట్‌ సెక్రేటరీలు టీములుగా ఏర్పడి దాడులు నిర్వహించారు. పలు దుకాణాల్లో 1.20టన్నుల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లను స్వాదీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న కవర్లను మున్సిపల్‌ కార్యాలయానికి తరలించారు. ఈ సందర్బంగా మున్సిపల్‌ కమిషనర్‌ మాట్లాడుతు గతంలో వారంలో మూడు రోజులు ప్లాస్టిక్‌పై దాడులు నిర్వహించి, పెద్ద ఎత్తున జరిమానాలు విధించామన్నారు. ఇక నుంచి ప్రతి రోజు దాడులు నిర్వహిస్తామన్నారు. ఒక సారి పట్టుబడిన వారు రెండో సారి పట్టుబడితే వారికి పెద్ద ఎత్తున జరిమానాలు విధించడంతో పాటు పోలీస్‌ కేసులు నమోదు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో శానిటేషన్‌ సెక్రటరీలు పాల్గొన్నారు.