Dec 01,2022 21:57

హోటళ్లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు
ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌

         నగరపాలక సంస్థ పరిధిలోని నిషేధిత ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్న హోటళ్లు, వ్యాపార సంస్థల్లో తనిఖీలు నిర్వహించి జరిమానా విధించినట్లు ఎంహెచ్‌ఒ డాక్టర్‌ మాలతి తెలిపారు. స్థానిక మెయిన్‌ బజార్‌లో గురువారం పలు హోటళ్లు, ఫ్యాన్సీ, వ్యాపార దుకాణాల్లో ఆమె తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంహెచ్‌ఒ మాలతి మాట్లాడుతూ కమిషనర్‌ ఆదేశాల ప్రకారం నగరంలో నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై విస్తృత తనిఖీలు చేపట్టామన్నారు. ప్లాస్టిక్‌ కవర్లు వినియోగిస్తున్న వ్యాపారులకు రూ.14 వేలు జరిమానా విధించి కవర్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మహేందర్‌, సుబ్బారావు, సచివాలయ, పారిశుధ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.