ప్లాస్టిక్ వాడుక పర్యావరణ ముప్పని తెలిసినా!
దొంగచాటుగా విక్రయాలు సాగిస్తూనే ఉన్నాం
ప్లాస్టిక్ వినియోగాన్ని నివారించలేకపోతున్నాం!!
శాస్త్రవేత్తల మాటలు కొట్టి పడేస్తున్నాం
నింగీ, నేలా, గాలీ, నీరు కాలుష్యంతో
నింపేస్తున్నాం
సంద్రాలను సైతం ప్లాస్టిక్ వ్యర్థాలతో
కప్పేస్తున్నాం
మనుగడను ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాం
లక్షల లక్షల పక్షులు ప్రాణాలు వదులుతున్నా
మూగ ప్రాణులు ప్లాస్టిక్ రక్కసికి బలౌతున్నా?
భూమి అంతర్భాగంలో కరగలేక విషవాయువులు
వెలువరిస్తూ మన ఊపిరితిత్తులు తినేస్తున్నా..?
మనలో ప్లాస్టిక్ పైన మమకారం
చావదెందుకో...?
మనిషి ప్లాస్టిక్ కాలుష్య నివారణకు సిద్దమంటూ
ప్రతి ఒక్కరం ప్లాస్టిక్ వాడక నిర్మూలనకై కదులుదాం
గోనె సంచులు, క్లాత్ బ్యాగులూ వాడుక చేద్దాం
ప్రకృతి సమతుల్యతను కాపాడుకుందాం
రేపటి తరాలకు ప్లాస్టిక్ రహిత సమాజాన్ని
కానుకగా ఇద్దాం
- రాము కోలా
9849001201