ప్రజాశక్తి-నందిగామ
నందిగామ పట్టణంలో ప్లాస్టిక్ బ్యానర్ల ప్రింటింగ్ నిలుపుదల చేసి క్లాత్ బ్యానర్లు వినియోగించాలని నందిగామ నగర పంచాయతీ కమిషనర్ డా.ఎస్.జయరామ్ పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నందిగామ నగర పంచాయత్ కార్యాలయములో పట్టణ పరిధిలోని ఫ్లెక్సీ బ్యానర్ల యాజమనులతో మున్సిపల్ కమిషనర్ డా.ఎస్. జయరాం సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నవంబరు ఒకటవ తేదీ నుండి పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ బ్యానర్లను ప్రింటింగ్ వేయకుండా నిలుపుదల చేయాలని, క్లాత్ బ్యానర్ల ను మాత్రమే వినియోగించాలని సూచించారు. అంతేకాకుండా 120 మైక్రాన్ల కంటే తక్కువగా ఉండే, ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వస్తువులపై నిషేదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఝాన్సీ , మరియు టౌన్ ప్లానింగ్ సిబ్బంది పాల్గొన్నారు.










