Aug 28,2023 18:38

డాక్టర్‌ ప్రకాష్‌ చవలను సత్కరిప్తున్న దృశ్యం

ప్రజాశక్తి-కందుకూరు :ప్రముఖ సూపర్‌ స్పెషాలిటీ ఒంగోలు ఉపాస్‌ హాస్పటల్‌ వారి ఆధ్వర్యంలో ప్రముఖ ఆర్తోస్కోపీ, మోకాళ్ల చిప్పల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్‌ ప్రకాష్‌ చవల ఆధ్వర్యంలో ఆత్రటైస్‌, ప్లాస్మా థెరపీ, ఆపరేషన్‌ లేకుండా వెన్నుపూసకు చికిత్స వంటి వాటిపై పెద్ద బజారులోని శ్రీ సీతారామ కళ్యాణ మండపంలో సోమవారం అవగాహన కల్పించారు. డాక్టర్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ మోకాళ్ల అరుగుదల మొదటి దశలో ఉన్న వారికి ఆపరేషన్‌ లేకుండా ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స అందించి మోకాలు నొప్పులు నయం చేయవచ్చని తెలిపారు. వెన్నుపూస సమస్య ఉన్నవారికి కూడా ఆపరేషన్‌ లేకుండా నెప్పి ఉన్న ప్రాంతంలో ఇంజక్షన్‌ ద్వారా వెన్నుపూస సమస్యను నివారించవచ్చునని తెలిపారు. ఆత్రటైస్‌ ఉన్నవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే దానిని కూడా నివారించవచ్చునని తెలిపారు. అవగాహన సదస్సు కార్యక్రమానికి విచ్చెన వారి సందేహాలను నివత్తి చేశారు. అనంతరం డాక్టర్‌ ప్రకాష్‌ ను విపిజి గోల్డ్‌ షాప్‌ యజమాని వేముల సుకుమార్‌ గుప్తా, పార్థు గజమాలతో ఘనంగా సన్మానించారు. కోదండ రామాలయం ప్రెసిడెంట్‌ మురారిశెట్టి వెంకటసుబ్బారావు, ప్రకాశం జిల్లా వాసవి సేవాదళ్‌ అధ్యక్షులు చీదేళ్ళ వేణుగోపాల్‌,చీఫ్‌ ఆర్గనైజర్‌ మోదడుగు వెంకటేశ్వర్లు,ఆర్యవైశ్య చైర్మన్‌ చక్కా వెంకట కేశవరావు, విశ్రాంత తహసిల్దార్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.