
నూజివీడు రూరల్ : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణలో సోమవారం ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి సోమవారం ఏర్పాటు చేసే ఈ కేంద్రంలో కూరగాయలు, బ్లాక్ రైస్, బెల్లం, పసుపు తదితర వాటిని విక్రయిస్తున్నారు. జెడ్‌పిఎన్‌ఎఫ్‌లో భాగంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు, రైతులు పేర్కొన్నారు. పురుగులమందు పిచికారీ చేయని పూర్తి సేంద్రియ ఎరువులతో కూరగాయలను విక్రయిస్తున్నామని తెలిపారు.