ప్రజాశక్తి- పెదబయలు :కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిషత్ కార్యాలయంలో గురువారం వివిధ శాఖల అధికారులు, సచివాలయం సిబ్బందితో ఎంపీడీఓ పూర్ణయ్య, తహసీల్దార్ కృష్ణారావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ పూర్ణయ్య మాట్లా డుతూ, ప్రధానమంత్రి ఆది ఆదర్శ గ్రామీణ యోజన పథకం కింద మండలంలో 12 గ్రామాలను ఎంపిక చేయాడం జరిగిందన్నారు. సచివాలయం సిబ్బంది సర్వే నిర్వహించి మౌలిక సదుపాయాలను గుర్తించాలన్నారు. అంగన్వాడీ భవన మరమ్మతులు, మురుగు కాలువలు, సిసి రోడ్లు, విద్యుత్ సదుపాయాలు ప్రతి గ్రామానికి కల్పించేందుకు ప్రత్తిపాదనలు తయారు చేయాలని ఎంపీడీఓ తెలిపారు. ఈనెల 11 నుండి 20 వరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సర్వే నిర్వహించి గ్రామ సభల ద్వారా ప్రతిపదించి తీర్మానం చేసి సమర్పించాలని ఆదేశించారు.ప్రధానమంత్రి పివి టిజి మిస్సన్ కింద మండలంలో 161 అదిమజాతి గిరిజన గ్రామాలలో జీవన స్థితిగతులు నమోదు చేయాలని ఆదేశించారు.










