ఆర్డీవో జయరాం
ప్రజాశక్తి -కొత్తకోట:రెండో విడత జరిగే భూ సర్వేలో ఎక్కడా సమస్యలు లేకుండా పక్కాగా నిర్వహించాలని నర్సీపట్నం ఆర్డీవో జయరాం స్పష్టం చేశారు. స్థానిక మండల రెవెన్యూ కార్యాలయంలో ఆయన శనివారం జగనన్న భూ సర్వే, ఓటుకు ఆధార్ అనుసంధానం పై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొదటి విడత జరిగిన సర్వేపై రైతుల నుంచి అభ్యంతరాలు వచ్చాయని, అటు వంటి పరిస్థితి ఈ దపాలో రాకుండా చూడాలని తెలిపారు. రెవెన్యూ అధికారులు, వీఆర్వోలు, సర్వే సిబ్బంది సమన్వయంతో పని చేసి రెండో విడత సర్వేలో రైతుల నుంచి అభ్యంతరాలు, తప్పులు లేకుండా చూడాలని, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని తెలిపారు. తహసిల్దారు మహేశ్వరరావు, ఆర్.ఐలు సతీష్, చినబ్బాయి, మండల సర్వేయరు సత్యనారాయణ పాల్గొన్నారు.










