బండి ఆత్మకూరు జగనన్న కాలనీ పరిశీలించిన సిపిఎం నాయకులు
పక్కా గృహాలకు రూ 5 లక్షలు ఇవ్వాలి : సిపిఎం
ప్రజాశక్తి - బండి ఆత్మకూర్
జగనన్న కాలనీలోని పక్కా గృహాలకు ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని సిపిఎం మండల కార్యదర్శి రత్నమయ్య, మండల నాయకులు రాజు, సుబ్బరాయుడు, డివైఎఫ్‌ఐ నాయకులు రాజేష్‌లు డిమాండ్ చేశారు. శనివారం బండి ఆత్మకూరు మండల కేంద్రంలోని జగనన్న కాలనీ వారు పరిశీలించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గృహాలు నిర్మించుకునేందుకు ప్రభుత్వం ఇచ్చే రూ.1,80,000 ఏమాత్రం సరిపోదని, నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉందని, ఐదు లక్షలు ఇస్తే కానీ నిర్మాణాలు చేపట్టలేరని అన్నారు. జగనన్న కాలనీలకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు జయన్న, శ్రీనివాసులు, రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.










