May 02,2023 23:55

సంక్షేమ పథకాల కరపత్రాలను లబ్ధిదారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి
ప్రజాశక్తి - రంపచోడవరం

వైసిపి ప్రభుత్వం పకడ్బందీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. మండలంలోని ఉట్ల సచివాలయం పరిధిలోని ఉట్ల, రామన్నపాలెం గ్రామాల్లో మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, ఆయా పథకాలు లబ్ధిదారులకు అందాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. అర్హత ఉండి, సంక్షేమ పథకాలు అందని వారికి రానున్న రోజుల్లో అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పిటిసి, వైస్‌ ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసిపి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.