మూల్యాంకన కేంద్రాన్ని సందర్శించిన దేవానందరెడ్డి
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరు స్టాల్ గరల్స్ హైస్కూల్‌లోని పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి శుక్రవారం సందర్శించారు. పరీక్ష పత్రాల మూల్యాంకన తీరును పరిశీలించారు. పరీక్ష పత్రాల మూల్యాంకనం చాలా జాగ్రత్తగా చేయాలని సూచించారు. మూల్యాంకన కేంద్రంలో ఉపాధ్యాయులకు చల్లని తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయటంపై అధికారులను అభినందించారు. మూల్యాంకనం పూర్తయ్యే వరకూ పొరపాట్లకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఏసీఒలకు సూచించారు. కార్యక్రమంలో డిఇఒ పి.శైలజ, ఉప విద్యాశాఖ అధికారి కె.సుధాకర్‌రెడ్డి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ వెంకటరెడ్డి, ఉర్దూ డిఐ ఖాసిం తదితరులు పాల్గొన్నారు.










