
ప్రజాశక్తి పుట్టపర్తి అర్బన్ ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 7న పుట్టపర్తికి వస్తున్న సందర్భంగా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి కార్యక్రమాల ఆర్డినేటర్ రఘురాం, జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు సంయుక్తంగా పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు మడకశిర తిప్పేస్వామి, కదిరి సిద్ధారెడ్డి, పుట్టపర్తి శ్రీధర్ రెడ్డి, రాప్తాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, పెనుకొండ శంకర్‌నారాయణ, ఎమ్మెల్సీ మంగమ్మ, జాయింట్ కలెక్టర్ టిఎస్ చేతన్, ఎస్పీ మాధవరెడ్డి, పెనుకొండ సబ్ కలెక్టర్ కార్తీక్, జిల్లాలోని ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాల గురించి ఆర్డినేటర్ రఘురాం వివరించారు. పుట్టపర్తి విమానాశ్రయం వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు ఎమ్మెల్యేలతో పాటు పలువురు ముఖ్య ప్రజా ప్రతినిధులు హాజరవుతారన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కేటాయించిన విధులను సక్రమంగా నిర్వర్తించాలన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాట్లాడుతూ ఎలాంటి లోటుపాట్లకు తావు ఇవ్వకుండా బాధ్యతాయుతంగా పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. అఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి సుబ్బారావు, పిఆర్ ఎస్‌ఇ గోపాల్ రెడ్డి, డిసిహెచ్‌ఎస్ డాక్టర్ ఎమ్‌టి నాయక్, డిసిఒ కృష్ణ నాయక్, పరిశ్రమల శాఖ అధికారి చాంద్‌బాషా, పట్టు పరిశ్రమల శాఖ జెడి పద్మమ్మ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రషీద్ ఖాన్, సర్వే ల్యాండ్స్ రికార్డ్స్ ఏడీ రామకృష్ణ, ఎపిఎంఐపి టీడీ సుదర్శన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, ఐసిడిఎస్ పీడీ లక్ష్మి కుమారి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివరంగ ప్రసాద్, డిపిఒ విజరు కుమార్, గిరిజన సంక్షేమ శాఖ అధికారి మోహన్ రావు, బీసీ సంక్షేమ శాఖ అధికారి నిర్మలా జ్యోతి, సిపిఒ విజరు కుమార్, స్కిల్ డెవలప్మెంట్ అధికారి ఖయ్యూం, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.