రాయచోటి : ప్రజల అవసరాలను తీర్చేందుకు రూపొందించిన జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ గిరీష పిలుపు నిచ్చారు. గురువారం జగనన్న సురక్ష కార్యక్రమంపై కలెక్టర్ గిరీష ఆర్‌డిఒలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, తహశీల్దార్‌లు, ఎంపి డిఒలు, మున్సిపల్ కమిషనర్‌లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఆర్‌ఒ సత్య నారాయణ, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా కో-ఆర్డినేటర్ మనోహర్‌రాజు, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ జగనన్న సురక్ష స్పెషల్ ఆఫీసర్‌లు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ గిరీష మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టా త్మకంగా చేపడుతోందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో కార్యక్ర మాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికా రులను ఆదేశించారు. ఈ కార్యక్రమం నిర్వహణపై సచివాలయ ఉద్యోగులకు, వాలంటీర్లకు శిక్షణ ఇవ్వలని పేర్కొన్నారు. జూన్ 24 నుంచి 30వ తేదీ వరకు పట్టణ, గ్రామ వార్డుల్లో వాలంటీర్, గహ సారధులు ఇంటింటికీ వెళ్లి కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించి ప్రచారం నిర్వహించడంతో పాటు ప్రజల సమస్యలను నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో ఎమ్మెల్యే నుంచి సర్పంచ్, గహ సారధుల వరకు అందరిని భాగ స్వామ్యం చేయాలని తెలిపారు. క్యాంపు రోజు అన్ని సిద్ధం చేసుకోవాలని చెప్పారు. అధికారులు బాధ్య తాయుతంగా కార్యక్రమ నిర్వహణలో భాగస్వా ములు కావాలని పేర్కొ న్నారు. జగనన్న సురక్ష యాప్‌ను ప్రారం భించిన అనంతరం వారం పాటు వాలంటీర్ గహ సారధులు ఇంటింటికీ వెళ్లి అమవుతున్న పథకాలకు సంబంధించి ప్రజలకు చర్చించాలని పేర్కొన్నారు. సమస్యలను గుర్తించడంతో పాటు వివరాలను నమోదు చేసుకొని సంబంధిత డిజిటల్ అసి స్టెంట్లకు ఇవ్వాలన్నారు. ఆయా సమస్యలపై డిజిటల్ అసిస్టెంట్లు ఈ సర్వీస్ ద్వారా తప్ప నిసరిగా సర్వీస్ రిక్వెస్ట్ నమోదు చేయాలన్నారు. డివిజన స్థాయిలో ఆయా ఆర్‌డిఒలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలని, జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ జిల్లా మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ తెలిపారు. శిబిరం నిర్వహణ ముందు నుండి వాలంటీర్లు క్లస్టర్లలో ఇంటింటికీ తిరిగి ప్రజల యొక్క అవసరాలు అనగా కుల ధవీకరణ పత్రం, ఆదాయ ధవీకరణ పత్రం, జనన ధవీకరణ పత్రం, మరణ ధవీకరణ పత్రం, వివాహ ధవీకరణ పత్రం, కుటుంబ సభ్యుడి ధవీకరణ పత్రం, మ్యుటేషన్ లావాదేవీలు, ఆధార్‌కు ఫోన్ నెంబరు అనుసంధానం, పంట సాగు హక్కు కార్డులను గుర్తించి, అవి పొందుటకు అవసరమైన ధవపత్రములు తెలియచేసి శిబిరం జరిగే రోజున అందచేయుటకు అవసరమైన చర్యలు తీసుకొనవలసినదిగా ఆదేశించారు. వాలం టీర్లు తమ క్లస్టర్లలో ప్రతి ఒక్కరికి శిబిరం జరిగే తేది, సమయం మరియు ప్రదేశం తెలియ జేయల న్నారు. ప్రభుత్వం సచివాలయాల ద్వారా ముఖ్యమైన 9 సేవలను శిబిరం జరిగే రోజులలో పొందవచ్చని తెలియజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సురక్ష కార్యక్రమం ఉద్దేశ్యాన్ని అవగాహన చేసుకొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆదేశించారు. కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి అలక్ష్యాన్ని సహించబోమని, ప్రజలకు సేవలు అందించే విషయంలో పొరపాట్లకు తావివ్వకుండా నిర్వహించాలని తెలియచేసారు. జగనన్న సురక్ష యాప్‌పై జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ అధికారులకు శిక్షణ ఇచ్చారు.










