Sep 12,2023 22:14

సమావేశంలో పాల్గొన్న అధికారులు

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : జగనన్న సురక్ష కింద సెప్టెంబర్‌ 30 నుండి అక్టోబర్‌ నెలాఖరు వరకు నిర్వహించే వైద్య శిబిరాల్లో రోగగ్రస్తులను గుర్తించి వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలనీ జిల్లా వైద్యాధికారి ఎస్‌వి. కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య మరియుఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టేట్‌ నోడల్‌ ఆఫీసర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ శివ శంకర్‌ బాబు, వైద్యాధికారి ఎస్‌వి కృష్ణారెడ్డి, డిసిహెచ్‌ఎస్‌ తిపేంద్ర నాయక్‌. డిఎంఒలు బాబా ఫక్రుద్దీన్‌, కేసీ నాయక్‌, టిబి యూనిట్‌ ఆఫీసర్‌ డి తిప్పయ్య, డిఐఒ డాక్టర్‌ కృష్ణయ్య, డిప్యూటీ డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ సెల్వియా షలోమన్‌, డాక్టర్‌ మంజువాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నోడల్‌ ఆఫీసర్‌ మాట్లాడుతూ, సెప్టెంబర్‌ ఒకటో తేదీ నుండి 15వ తేదీ వరకు గ్రామాల్లో ఎఎన్‌ఎంలు పర్యటించి పేషంట్ల జాబితా తయారు చేయాలని, సెప్టెంబర్‌ 16 నుండి 30 వరకు సచివాలయ వాలంటీర్లు ఇంటింటికి సర్వే చేసి ఎఎన్‌ఎంలు గుర్తించిన పేషెంట్ల వద్దకు వెళ్లి క్యాంపు వివరాలను తెలియ చేయాలని అన్నారు. సెప్టెంబర్‌ 30 నుండి సచివాలయ వారిగా హెల్త్‌ క్యాంపులు నిర్వహిస్తారని వాటిలో స్థానిక వైద్య సిబ్బందే కాక, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు, ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల, ఐఎంఎ వంటి సంస్థల ఆధ్వర్యంలో స్పెషలిస్ట్‌ డాక్టర్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ మెడికల్‌ క్యాంపులో ఒపి సేవలు, అన్ని రకాలైన టెస్టులు ఖరీదైన మందులు అందజేస్తారని తెలిపారు. అవసరమైన వారికి జిల్లా ఆసుపత్రులలో ఆపరేషన్లు చికిత్సలు అందించేందుకు సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లోని వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాండ్లపెంట : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో మంగళవారం ఎంపీపీ జగన్మోహన్‌ ఆధ్వర్యంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై వైద్య సిబ్బందికి అవగాహన కల్పించారు, ఎంపీడీవో రాము నాయక్‌, వైద్యాధికారి మహేశ్వర్‌ మారుతి ఎంపీపీ జగన్మోహన్‌ మాట్లాడుతూ 16వ తేదీ నుంచి గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేసి ప్రజల ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకోవాలన్నారు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి వివరాలు నమోదు చేసుకొని 30వ తేదీ జరిగే వైద్య శిబిరాలకు పంపే విధంగా చూడాలని వారు తెలిపారు. ప్రభుత్వం ఉచితంగా వైద్య అందిస్తుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ రామ్మోహన్‌, వైద్యాధికారి బాబాఫక్రుద్దీన్‌, వైద్య సిబ్బంది రవి కుమార్‌చ పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు
లేపాక్షి : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో నరసింహ నాయుడు అధ్యక్షతన ఆరోగ్య సురక్షపై అవగాహన కల్పించారు. ప్రతి పంచాయతీ పరిధిలో అధికారులు కలిసి కట్టుగా పనిచేసిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్నివిజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆనంద్‌ కుమార్‌, రామాంజనేయులు, మల్లికార్జున, ఎఎన్‌ఎంలు, సచివాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పుట్టపర్తి రూరల్‌ : ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్‌ లక్ష్యంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఆశాలకు, అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. పుట్టపర్తి మండలంలో సెప్టెంబర్‌ మూడవ తేదీ నుండి 13వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమంలో ఆశలు, అంగన్వాడీలు ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య పరిస్థితి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు గుర్తించాలన్నారు. గుర్తించిన సమస్యలను ఆన్లైన్లో అప్లోడ్‌ చేసి వీటికి సంబంధించిన నిపుణులైన డాక్టర్లను క్యాంపులో అందుబాటులో ఉంటే వారికి చికిత్స జరిగేలా చూడాలన్నారు. డాక్టర్లు నాగరాజు నాయక్‌, నాగార్జున, జోష్ణ, వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమణారెడ్డి, ఎంపీడీవో అశోక్‌ కుమార్‌ రెడ్డి, ఐసిడిఎస్‌ సూపర్వైజర్‌ భారతీయ దేవి, సిహెచ్‌ఒ నగేష్‌ తదితరులు పాల్గొన్నారు.