
రాయచోటి: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిం చాలని కలెక్టర్ గిరీష అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని, మినీ వీడియో కాన్ఫరెన్స్ హల్‌లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంపై మెడికల్ ఆఫీసర్‌లు ఎంపిడిఒలు, తహశీల్దార్లతో కలెక్టర్ గిరీష వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెం బర్ 30 తేదీన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగు తుందన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఈనెల 15వ తేదీ నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి సంబం ధించిన బ్రోచర్లు పంపిణీ చేయా లన్నారు. 16వ తేదీ నుంచి ఏఎన్ ఎంలు, సిహెచ్వోలు ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి వారిని వైద్య శిబిరాలకు పంపించాలన్నారు.జగనన్న ఆరోగ్య సురక్ష పేద ప్రజలకు వరం లాంటిదని వైద్య అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఈ కార్యక్ర మాన్ని విజయవంతం చేయాల న్నారు. వైద్యులు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్ర మం ద్వారా గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించా లన్నారు. ఈ క్యాంపు నందు ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్లు, ఇద్దరు మెడికల్ ఆఫీసర్లు వైద్య సిబ్బంది మెడికల్ క్యాంపులో పాల్గొనడం జరుగు తుందన్నారు. వైద్యులు రోగులను ఇతర ఆసుపత్రులకు రెఫర్ చేసేటప్పుడు పేషెంట్ యొక్క వివరాలు ఆరోగ్యశ్రీ యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు. ప్రభుత్వం జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని జిల్లా వ్యాప్తంగా అన్ని సచివాలయాల పరిధిలో కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జగనన్న సురక్ష కార్యక్ర మానికి ఎమ్మెల్యే, సర్పంచ్ ఇతర ప్రజా ప్రతినిధులు అందరినీ ఆహ్వానించి భాగస్వామ్యం చేయాలన్నారు. క్యాంపు నిర్వహించే గ్రామాలలో ఒక రోజు ముందే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకో వాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో జగనన్న విద్యా దీవెన, జగనన్న తోడు కార్యక్రమాలకు సంబంధించి 100 శాతం ఇకెవైసి పూర్తి చేయాలన్నారు. ఇకెవైసి పూర్తి చేయకపోతే తర్వాత వాళ్లు ఆ పదకానికి అనర్హులవు తారన్నారు. కాపునా సంబంధిత అధికారులందరూ ఈ కేవైసీ తప్పక చేయించాలన్నారు.తప్పులు లేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజల నుంచి వచ్చిన క్లెమ్స్ అండ్ ఆబ్జెక్షన్ ఒక్కటి కూడా పెండెన్సీ లేకుండా ఆల్ ఫామ్స్ క్లియర్ చేయాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, డిఅర్‌ఒ సత్యనారాయణ, డిఎంహెచ్‌ఒ డాక్టర్ కొండయ్య, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.