Oct 23,2023 14:35

ఐసీసీ మెన్స్‌ వన్డే వరల్డ్‌ కప్‌ 2023 టోర్నీలో భాగంగా చెన్నైలో పాకిస్తాన్‌, ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌ ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్తాన్‌, నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 282 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షెఫీక్‌, ఇమామ్‌ ఉల్‌ హక్‌ కలిసి తొలి వికెట్‌కి 56 పరుగులు జోడించారు. 22 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన ఇమామ్‌ ఉల్‌ హక్‌, అజ్మతుల్లా ఓమర్‌జారు బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు.. బాబర్‌ ఆజమ్‌, అబ్దుల్లా షెపీక్‌ కలిసి రెండో వికెట్‌కి 54 పరుగులు జోడించారు. 75 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 58 పరుగులు చేసిన అబ్దుల్లా షెఫీక్‌, నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. మహ్మద్‌ రిజ్వాన్‌ ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసి అవుట్‌ కాగా 34 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన సౌద్‌ షకీల్‌, మహ్మద్‌ నబీ బౌలింగ్‌లో అవుట్‌ అయ్యాడు. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌92 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 74 పరుగులు చేసి 206 పరుగుల వద్ద ఔటయ్యాడు. షాదబ్‌ ఖాన్‌, ఇఫ్తికర్‌ అహ్మద్‌ కలిసి ఆరో వికెట్‌కి 45 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులు చేసిన ఇఫ్తికర్‌ అహ్మద్‌, నవీన్‌ ఉల్‌ హక్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్‌ అయ్యాడు. 38 బంతుల్లో ఓ ఫోర్‌, ఓ సిక్సర్‌తో 40 పరుగులు చేసిన షాదబ్‌ ఖాన్‌, ఇన్నింగ్స్‌ ఆఖరి బంతికి అవుట్‌ అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్లలో నూర్‌ అహ్మద్‌ 3, నవీన్‌-ఉల్‌-హక్‌ 2, నబీ 1, అజ్మతుల్లా 1 వికెట్‌ దక్కింది.

  • బాబర్‌ 50.. పాకిస్తాన్‌ 172/4

పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. 69 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 36 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ 172 పరుగులు చేసింది.

  • సౌద్‌ షకీల్‌ ఔట్‌.. పాకిస్తాన్‌ 163/4

25 పరుగులు చేసిన సౌద్‌ షకీల్‌ నబీ బౌలింగ్‌లో రషీద్‌ఖాన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యడు. 34 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. క్రీజులో బాబర్‌ 47, షాదాబ్‌ ఖాన్‌ ఉన్నారు.

  •  30 ఓవర్లకు పాకిస్తాన్‌ 139/3

30 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్‌ 3 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. కెప్టెన్‌ బాబర్‌ 52 బంతుల్లో 41, సౌద్‌ షకీల్‌ 21 బంతుల్లో 9 పరుగులు చేశారు.

  • షాక్‌ రిజ్వాన్‌ ఔట్‌

పాకిస్తాన్‌ తరుపున నిలకడగా పరుగులు చేస్తున్న వికెట్‌ కిపర్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ కేవలం 8 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ముజిబ్‌కు క్యాచ్‌ ఔటయ్యాడు. పాకిస్తాన్‌ ప్రస్తుతం 25 ఓవర్లు పుర్తయ్యేసరికి 3 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. క్రీజులోకి సౌద్‌ షకీల్‌ వచ్చాడు.

  • అబ్దుల్లా షఫీక్‌ ఔట్‌

75 బంతుల్లో 58 పరుగులు చేసిన ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ నూర్‌ అహ్మద్‌ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి రిజ్వాన్‌ వచ్చాడు. బాబర్‌ 38 బంతుల్లో 33 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు. పాకిస్తాన్‌ ప్రస్తుతం 23 ఒవర్లుకు 103 పరుగులు చేసింది.

  • 20 ఓవర్లకు 100

20 ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్తాన్‌ 100 పరుగులు చేసింది. ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ 64 బంతుల్లో 51 పరుగులు.. కెప్టెన్‌ బాబర్‌ 34 బంతుల్లో 30 పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.
 

  • అబ్దుల్లా షఫీక్‌ 50

పాకిస్తాన్‌ ఓపెనర్‌ అబ్దుల్లా షఫీక్‌ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. మరోవైపు కెప్టెన్‌ బాబర్‌ 24 పరుగులు చేశాడు. ప్రస్తుతం పాకిస్తాన్‌ 19 ఓవరు ముగిసే సరికి 93 పరుగులు చేసింది.

  • ఇమామ్‌-ఉల్‌-హక్‌ ఔట్‌

17 పరుగులు చేసిన ఇమామ్‌-ఉల్‌-హక్‌ అజ్మతుల్లా బౌలిగింగ్‌లో నవీన్‌ ఉల్‌-హక్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. క్రీజులోకి బాబర్‌ ఆజ్‌ం అజామ్‌ వచ్చాడు. అబ్దుల్లా షఫీక్‌ 39 బంతుల్లో 38 పరుగులు మీద బ్యాటింగ్‌ చేస్తున్నాడు.

  • 10 ఓవర్‌లో 2 పరుగులు

నబి వేసిన 10వ ఓవర్‌లో 2పరుగులు మాత్రమే వచ్చాయి. కాగా ఇమామ్‌-ఉల్‌-హక్‌ 21 బంతుల్లో 17 పరుగులు చేయగా.. అబ్దుల్లా షఫీక్‌ 39 బంతుల్లో 38 పరుగులు చేశాడు.

  • 8 ఓవర్లు 51

8 ఓవర్లు పూర్తయ్యే సరికి పాకిస్థాన్‌ 51 పరుగులు చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్‌ 31 బంతుల్లో 35 పరుగులు, ఇమామ్‌-ఉల్‌-హక్‌ 17 బంతుల్లో 15 పరుగుల మీద బ్యాటింగ్‌ చేస్తున్నారు.

  • టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌.. బ్యాటింగ్‌

భారత్‌ ఆతిథ్యమిస్తున్న వరల్డ్‌ కప్‌ టోర్నీ ఉత్సాహభరితంగా సాగుతోంది. వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు తలపడుతున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ జట్టు ఒక మార్పు చేసింది. మహ్మద్‌ నవాజ్‌కు బదులు.. ఆల్‌ రౌండర్‌ షాదాబ్‌ ఖాన్‌ జట్టులోకి తీసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌ జట్టులోనూ ఒక మార్పు చేసింది. లెఫ్టార్మ్‌ సీమర్‌ ఫజల్‌ హక్‌ ఫరూఖీ స్థానంలో నూర్‌ అహ్మద్‌ జట్టులోకి వచ్చాడు.

ఆఫ్ఘనిస్తాన్ : రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(సి), అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్-ఉల్-హక్, నూర్ అహ్మద్

పాకిస్థాన్ : అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్, సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, ఉసామా మీర్, షాహీన్ అఫ్రిది, హసన్ అలీ, హరీస్ రవూఫ్