కడప అర్బన్ : వైసిపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలు వేస్తూ ఉందని టిడిపి సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి, నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జి అమీర్ బాబు, మన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం 39వ డివిజన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు ఎపిలోనే ఆకాశాన్ని అంటుతు న్నాయని పేర్కొన్నారు. దోచుకో, దాచుకో అన్న రీతిలో సిఎం జగన్ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియా రాజ్య మేలుతూ ఉందని తెలిపారు. చంద్రబాబు నాయుడు మరో సారి ముఖ్యమంత్రి చేయకపోతే రాష్ట్రం అధోగతి పాల వుతుందని తెలిపారు. ఎలాంటి నేరం చేయకపోయినా జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. కడిగిన ముత్యంలో బయటకు రావడం ఖాయమని పేర్కొన్నారు. టిడిపి జిల్లా అధికార ప్రతినిధి ఆమూరి బాలదాసు మాటా ్లడుతూ ప్రజలు టిడిపిని గెలిపిం చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు ఓబుల్ రెడ్డి, కొండ సుబ్బయ్య, ఏలియా, మీనాక్షి, స్వర్ణ, ఉమాదేవి, ఇమ్రాన్, అదిల్, గౌస్, లింగాల శివశంకర్ రెడ్డి, జయరామిరెడ్డి పాల్గొన్నారు.
ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేస్తున్న టిడిపి నాయకులు