Jul 12,2023 20:48

గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యే నవాజ్‌బాషా

నిమ్మనపల్లి : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే నవాజ్‌బాషా పేర్కొన్నారు. బుధవారం కొండయ్యగారిపల్లి పంచాయతీలోని గుడ్రెడ్డిగారిపల్లిలో సర్పంచు ఆర్‌.వరలక్ష్మి శశిధర్‌ రెడ్డి, సింగల్‌ విండో అధ్యక్షులు రెడ్డిశేఖర్‌రెడ్డి, వైస్‌ ఎంపిపి జయప్రకాశ్‌రెడ్డి, నాయకులు నవీన్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నవాజ్‌బాషా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. పలువురు త్రాగునీటి పైపులైన్లు, సీసీ రోడ్లు, మురుగునీటి కాలువలను, విద్యుత్‌ స్తంభాలు వేయించాలని, రెవెన్యూ సమస్యలపై ఎమ్మెల్యే దష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఎమ్మెల్యే ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచులు సుబ్రమణ్యం, చండ్రాయుడు, వైసిపి నాయకులు నరేంద్ర రెడ్డి, శశిధర్‌ రెడ్డి, సివి రమణారెడ్డి, విజరుకుమార్‌రెడ్డి, యుగంధర్‌రెడ్డి, నవీన్‌, హేమంత్‌, పంచాయతీ కార్యదర్శి మంజునాథ్‌, ఎస్‌ఐ రామకష్ణ, ప్రభుత్వ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.