
కడప (వేంపల్లె) : ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో పియుసి2 ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో బ్రాంచ్‌లు కేటాయించినట్లు ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి తెలిపారు. బుధవారం ఇడుపులపాయలోని ఒంగోలు క్యాంపస్‌లో ఒంగోలు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ జయరామిరెడ్డి, నూజివీడు డైరెక్టర్ శ్రీనివాసరావు, శ్రీకాకుళం డైరెక్టర్ జగదీశ్వరరావు, గోపాల్‌రాజు, ఆర్‌జియుకెటిహొక్యాంపస్‌లకు చెందిన అకడమిక్ డీన్ ప్రొఫెసర్ హరినారాయణ కలిసి విద్యార్థులకు బ్రాంచ్ కేటాయించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒంగోలు విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా, రిజర్వేషన్లు ఆధారంగా ఇంజనీరింగ్ బ్రాంచ్‌లు కేటాయించినట్లు తెలిపారు. పియుసి2 పరీక్షల్లో నాగరమ్య 9.89, సాయి నాగేశ్వరి 9.89 అనే విద్యార్థులు మొదటి ర్యాంకులు సాధించినట్లు తెలిపారు. నరేంద్ర అనే విద్యార్థి 9.87 మార్కులతో ద్వితీయహొర్యాంక్ సాధించినట్లు చెప్పారు. ప్రతి విద్యార్థి ఇంజనీరింగ్‌లో ప్రతిభ చూపి డిగ్రీ పొంది ఉజ్వల భవిష్యత్తును పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో పరిపాలన అధికారి నరసింహమూర్తి, అకడమిక్ డీన్ డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డి, ఒంగోలు పిఆర్ డాక్టర్ షేక్ ఇబ్రహీం, అయా ట్రిపుల్ ఐటీల డిన్‌లు పాల్గొన్నారు.హొ