Aug 12,2023 00:13

మాట్లాడుతున్న ఆదివాసీ గిరిజన సంఘం నేత బాలదేవ్‌

ప్రజాశక్తి- పాడేరు: పాడేరు ఐటీడీఏ 11 మండలాల పరిధిలోని పివిటీజీల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని, వారికి ప్రత్యేక నిధులు కేటాయించకుండా తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌ విమర్శించారు. చింతపల్లి గిరిజన సంఘం కార్యాలయంలో శుక్రవారం చింతపల్లి, జీకే వీధి, కొయ్యూరు, మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివాసి గిరిజన సంఘం మండల సహాయ కార్యదర్శి పి.బాలయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పివిటిజిలకు ఐటిడిఏ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా నాయకులు పాలికి లక్కు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పివిటిజిల అంత్యోదయకార్డులు రద్దు చేసిందన్నారు. వ్యక్తిగత సబ్సిడీ రుణాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, మంచినీటి, కమ్యూనిటీ హాలు, అంగన్వాడీ, భవనాలు నిర్మించాలన్నారు.2019నుండి 2023 వరకు 11మండలాల్లో 294 ఇల్లులు మాత్రమే పీవీటిజీ లకు మంజూరు చేసారని తెలిపారు. వ్యవసాయ యంత్రాలు, మిరియాల నిచ్చెన్నలు పూర్తి సబ్సిడీతో పంపిణి చేయలేదన్నారు. సబ్సిడీ తగ్గించడంతో ఎక్కువ మంది పివిటిజీలు ఆర్థిక ఇబ్బందులతో తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పివిటిజిలకు నిధులు మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా గౌరవధ్యక్షులు బోనంగి చిన్నయ్య పడాల్‌, జిల్లా ఉపాధ్యక్షులు పాంగి ధనుంజరు, కొర్ర బాలయ్య, జి కె వీధి మండల నాయకులు ఎ.బాజ్జిబాబు, జి.సత్యనారాయణ, పివిటిజి నాయకులు కొర్ర చిట్టిబాబు, పాంగి సూరిబాబు, పాంగి లక్హ్మణరావు, గెమ్మెలి రమేష్‌, మాజీ ఎంపీటీ సీ గుంటా జున్ను పాల్గొన్నారు.