ప్రజాశక్తి- అనంతగిరి:పివిటిజీ గిరిజనుల స్థితిగతులను గిరిగిజన వ్యవహారాల శాఖ డిప్యూటీ కార్యదర్శి ఎమ్మె ఎస్. రాణి ఆరా తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతంలో నివసిస్తున్న ఆదిమజాతి పివిటిసి గిరిజనుల స్థితిగతులు తెలుసుకొనందుకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సోమవారం అనంతగిరి మండలం గుమ్మకోట, గరుగుబిల్లి పంచాయతీలలో కేంద్రం బృందం పర్యటించింది. గ్రామాలలో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను, జీవనోపాధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు అమలు తీరుపై ఆరా తీశారు. స్థానిక గిరిజనులతో సమస్యల పట్ల ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి పథకాల అమలు, ఉపాధి వంటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు అందడం లేదని, తాగునీటి, రోడ్డు, గృహాలు. వంటి సౌకర్యాలు అందక అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నామని తెలిపారు. దీనికి ముందు గరుగుబిల్లి వైద్య ఆరోగ్య సబ్ సెంటర్‌ను పరిశీలించారు. సబ్ సెంటర్ మరుగుదొడ్లు వంటివి అధ్వానంగా ఉండడంతో సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ .రాంబాయి, ఇన్చార్జి ఎంపీడీవో వివి .కుమార్ పలుచాక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
గిరిజన ప్రాంతంలో నెలకొన్న మౌలిక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరుతూ స్థానిక ఎంపీపీ శెట్టి. నీలవేణి లిఖితపూర్వకంగా విన్నవించారు. తాగునీటి. రహదారి, గృహాలు వంటి సమస్యలతో ఆదివాసి గిరిజనులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకం పనులు 150 రోజుల కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ .రాంబాయి, ఇన్చార్జి ఎంపీడీవో వివి .కుమార్ పాల్గొన్నారు










