Sep 13,2023 18:48

పి.పి రావు వర్థంతి సభలో మాట్లాడుతున్న న్యాయవాది

ప్రజాశక్తి - లింగసముద్రం :సుప్రీమ్‌ కోర్టు సీనియర్‌ న్యాయవాది పద్మభూషణ్‌' కీ.శే. పవని పరమేశ్వరరావు న్యాయవాదులకు ఆదర్శప్రాయుడని రాష్ట్ర హైకోర్టు న్యాయవాది పవని శివకుమార్‌ పేర్కొన్నారు. పరమేశ్వరావు 6వ వర్థంతి సందర్భంగా బుధవారం లింగసముద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారుఆయన మాట్లాడుతూ పి.పి రావు మొగిలిచర్ల గ్రామంలో జన్మించి సుప్రీమ్‌ కోర్టులో సీనియర్‌ న్యాయవాదిగా పనిచేసిన ఆయన ఎన్నో సంచలనాత్మక కేసులను గెలించి న్యాయ కోవిదులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత ప్రభుత్వం పద్మభూషన్‌ ఇవ్వడంతో పాటు లోక్‌పాల్‌ మెంబర్‌గా నియమించారని చెప్పారు. తొలుత పి.పి.రావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాలర్పించారు. లోక్‌ అదాలత్‌ సభ్యులు ఎం.మాలకొండారెడ్డి, లింగస ముద్రం, మొగిలిచర్ల ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఉమ్మడిశెట్టి మాధవరావు, కె.సూర్యప్రకాశ్‌రావు, లింగసముద్రం మాజీ సర్పంచ్‌ ఉమ్మడిశెట్టి నాగేశ్వరరావు, న్యాయవాది మదాల మనోజ్‌, ఉన్నారు.