Apr 06,2023 01:11
తహశీల్దారుకు డిటి స్వాగతం

ప్రజాశక్తి-పిట్టలవాని పాలెం: పిట్టలవానిపాలెం మండల తహశీల్దారుగా కవిత బుధవారం బాధ్యతలు స్వీకరించారు. డిప్యూటీ తహసీల్దార్‌ చరణ్‌ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి సాదర స్వాగతం పలికారు. గతంలో ఈమె బాపట్లలో తహసీల్దారుగా బాధ్యతలు నిర్వహించి సాధారణ బదిలీలలో పిట్టలవానిపాలెం మండలం వచ్చారు. విఆర్‌ఓలు, రెవెన్యూ శాఖ సిబ్బంది తహశీల్దారు కవితకు అభినందనలు తెలిపి పరిచయం చేసుకున్నారు.