Oct 12,2023 19:56

దీక్షల్లో పాల్గొన్న న్యాయవాదులు

ప్రజాశక్తి - ఆదోని
మెస్కిలినీయస్‌ పిటిషన్లకు రూ.20 స్టాంప్‌లను అతికించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆదోని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గురువారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బార్‌ అసోసియేషన్‌ నాయకులు అంజినప్ప మాట్లాడుతూ... రాష్ట్రంలోని బార్‌ అసోసియేషన్లను సంప్రదించకుండా స్టాంపులను పెంచడం సరికాదన్నారు. దీనివల్ల అదనపు భారం పడుతుందని వాపోయారు. నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీనియర్‌ న్యాయవాదులు వైఆర్‌.మల్లికార్జున, సుందర్‌ సింగ్‌, దేవరాజు, జీవన్‌ సింగ్‌, తాయన్న, శ్రీధర్‌ రెడ్డి, జూనియర్‌ న్యాయవాదులు హుస్సేన్‌ సాని, విశ్వనాథ్‌, షబ్బీర్‌, రాజారత్నం పాల్గొన్నారు.