
పితానిని సన్మానిస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-వెలిగండ్ల: శుక్రవారం ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బీసీలకు ప్రభుత్వం నమ్మకద్రోహం -ఐక్యత పోరాటం పేరుతో అఖిలపక్షాలతో రౌండ్ టేబుల్ సమావేశం ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నూకసాని బాలాజీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిని తెలుగుదేశం పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గవదకట్ల హరికృష్ణ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయం, దౌర్జన్యాల గురించి అఖిలపక్ష సమావేశంలో వివరించారు.