ప్రజాశక్తి-అరకులోయ రూరల్:హెచ్‌ఎన్‌టీసీ కార్మికుల సమస్యలపై అరకులోయ పర్యటనకు వచ్చిన పాడేరు ఐటీడీఏ పీఓ అభిషేక్ కు పద్మపురం గార్డెన్లో సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్ ఐటీడీఏ పీవోకు సమస్యలను వివరించారు. అల్లూరి జిల్లాలో అరకువేలి మండలం పద్మావతి గార్డెన్, కొత్తవలస, చింతపల్లి నర్సరీలో పని చేస్తున్న హెచ్‌ఎన్‌టిసి కార్మికులకు 2022-23 కలెక్టర్ గెజిట్ జీవో ప్రకారం జీతాలు చెల్లించాలని కోరారు. 56 మంది కార్మికులకు మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని చెప్పారు. కొత్తగా నియమించబడిన కార్మికులకు కలెక్టర్ గెజిట్ జీవో ప్రకారుం జీతాలు వర్తింప జేసి పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు.కార్మికులకు వారాంతపు సెలవు అమలు చేయాలన్నారు.2010-2012 సంవత్సరాల ఈపీఎఫ్ డబ్బులు కార్మికుల నుండి వసూలు చేసి ఈపీఎఫ్ ఖాతాలో జమ చేయకుండా అవినీతి చేసిన వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కారం చేస్తామని కార్మికులకు పిఒ హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి జే.భగత్ రామ్, హెచ్.ఎన్.టి.సి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జగ్గారావు, పండు, సీతారాం, జోగి బాబు, శోభన్, కిరణ్ కుమార్, లక్ష్మి, మాలతి, అప్పలమ్మ, విమల పాల్గొన్నారు.










