వద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఒంటరి మహిళల జీవనానికి ఆర్థిక భరోసా కల్పించి, వారి మోముల్లో చిరునవ్వే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని విశాఖ ఉత్తర, పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్తలు కెకె.రాజు, ఆడారి ఆనందకుమార్ అన్నారు. పలు ప్రాంతాల్లో కొత్తగా మంజూరైన పింఛన్లును లబ్ధిదారులకు పండగ వాతావరణంలో అందజేశారు.
ప్రజాశక్తి - మాధవధార
49వ వార్డు బర్మాకాలనీ, తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్, జివిఎంసి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, అల్లు శంకరరావుతో కలిసి నూతన పింఛన్లును లబ్ధిదారులకు కెకె.రాజు అందజేశారు. ఈ సందర్భంగా సిఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. అనంతరం కెకె.రాజు మాట్లాడుతూ, గతంలో పింఛను రావాలంటే అప్పటికే లబ్ధిపొందుతున్న వారిలో ఎవరైనా చనిపోవాల్సిన దుస్థితి ఉండేదని, కానీ ఇపుడు అర్హతే ప్రాతిపదికన నిరంతర ప్రక్రియగా పింఛన్లును వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దకే జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో ఎపిడి పద్మావతి, యన్.రవికుమార్, ఐ. రవికుమార్, సరస్వతమ్మ, ఢిల్లీరావు, శకుంతల, మంగ, చిన్నారావు, బి.శంకర్, కిషోర్ పాల్గొన్నారు.
సీతమ్మధార : 46 వార్డు శాంతినగర్ సచివాలయం వద్ద కొత్తగా మంజూరైన పింఛన్లును లబ్ధిదారులకు వార్డు కార్పొరేటర్, డిప్యూటీ మేయర్ కటుమూరి సతీష్ అందజేశారు.కార్యక్రమంలో వార్డు సివో వరలక్ష్మీ, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు.
ములగాడ :61వ వార్డు కార్పొరేటర్ కొణతాల సుధ ఆధ్వర్యంలో స్థానిక మరిడిమాంబ కల్యాణ మండపంలో 72మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛన్లును పశ్చిమ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త ఆడారి ఆనంద్‌కుమార్ అందజేశారు. జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో 60 వార్డు కార్పొరేటర్ పివి సురేష్, బల్ల లక్ష్మణరావు, పిలక రామ్మోహన్‌రెడ్డి, బొగవల్లి నాగభూషణం, నూక రెడ్డి, చట్టి నూకరాజు పాల్గొన్నారు.
గోపాలపట్నం : 91, 92 వార్డుల్లో లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛన్లును జివిఎంసి కోఆప్షన్ సభ్యుడు బెహరా భాస్కరరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైసిపి వార్డు అధ్యక్షుడు గొర్రెల అప్పలస్వామి నాయుడు, నేత గొంతిన నాగరాజు పాల్గొన్నారు
సింహాచలం: 98వ వార్డ్డులో కొత్తగా మంజూరైన 79పింఛన్లును లబ్ధిదారులకు కార్పొరేటర్ పీవీ నరసింహం అందజేశారు.ఈ సందర్భంగా ఒంటరి మహిళలకు పింఛన్ల వయోపరిమితిని 50 ఏళ్ల నుంచి 35ఏళ్లకు మార్పుచేసి మునుపటిలా ఇవ్వాలని కోరారు.
ఆరిలోవ : 13వ వార్డు శివాజీనగర్‌లో 81 మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛన్లను వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత అందజేశారు. ముందుగా ముఖ్యమంత్రి జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. వార్డు ఇన్‌చార్జ్ కెల్ల సత్యనారాయణ, వైసిపి నేతలు పిల్లి వీర్రాజు, బేత దుర్గారావు, శ్రీను, వెంకట రెడ్డి, శంకర్, కేబుల్ రాజు పాల్గొన్నారు.
పిఎం పాలెం: 6,7 వార్డుల పరిధిలో 140మంది లబ్ధిదారులకు కొత్తగా మంజూరైన పింఛన్లను పంపిణీ చేశారు. రాష్ట్ర నగరాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పిల్ల సుజాత సత్యనారాయణ, వైసిపి నేతలు చందరరావు, వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు, పోతిన ఏళ్లాజి, పోతిన ప్రసాద్, గుంటూ బోయిన సంజీవ్ యాదవ్, పోతిన మూర్తి బాబు, రాయిన సాయి, కొండపల్లి వరలక్ష్మి, సుభాని పాల్గొన్నారు. 7వ వార్డులో వార్డు వైసిపి అధ్యక్షుడు పోతిన శ్రీను అధ్వర్యంలో పింఛన్ల పంపిణీ జరిగింది. సింహాచలం దేవస్థానం ట్రస్ట్‌బోర్డ్ సభ్యులు పిల్లా కృష్ణమూర్తి పాత్రుడు, పిల్లా సూరిబాబు పాల్గొన్నారు.
7వ వారు పిలకవాని పాలెం, వాంబే కాలనీలో టిడిపి 7వవార్డు కార్పొరేటర్ పిళ్ల మంగమ్మ ఆధ్వర్యంలో 37 మందికి కొత్త పింఛన్లు పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా వాణిజ్య విభాగ కార్యవర్గ సభ్యులు పీళ్ళ వెంకట్రావు, కనురి అచ్యుతరావు, నాగోతి ప్రకాష్, మామిడి దుర్గారావు, పోతినా బుజ్జి పాల్గొన్నారు.
లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎంపీపీ మజ్జి శారద ప్రియాంక, నాయకులు దశ్యం
ఆనందపురం: తర్లువాడలో కొత్తగా మంజూరైన పింఛన్లును ఎంపిపి మజ్జి శారద ప్రియాంక, సర్పంచ్ బి ఆర్‌బి నాయుడు, మజ్జివెంకటరావుఅందజేశారు. అనందపురంలో సర్పంచ్ చందక లక్ష్మి, గ్రామకార్యదర్శి సురేష్, గొట్టుపల్లిలో సర్పంచ్ గంటా జగదీశ్వరరావు పింఛను పంపిణీ చేశారు.










