ప్రజాశక్తి-యస్.రాయవరం:పింఛను నిలుపుదలపై మండలంలోని ధర్మవరం అగ్రహారం గ్రామానికి చెందిన కొండ్రపు బంగారమ్మ గ్రామ సచివాలయం వద్ద నిరసన చేపట్టింది. స్పందించిన ఎంపీడీవో రామచంద్రమూర్తి ఆమె వద్దకు వచ్చి ఫిబ్రవరి నుంచి పెన్షన్ ఇస్తామని, ఉన్నత అధికారులు తెలియచేశారని, దీక్ష విరమించాలని కోరారు. ఈ సందర్భంగా కొండ్రపు బంగారమ్మ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం అప్పలరాజు మాట్లాడుతూ, పెన్షన్ ఇప్పించాలని గత 16 నెలలుగా అధికారులను కోరుతున్నానన్నారు. ఏ ఆధారం లేక అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ మందులకు కూడా డబ్బులు లేక తీవ్రంగా అవస్థలు పడుతున్నానని తెలిపారు. అనంతరం కొండ్రపు బంగారమ్మకు ఎంపీడీవో రామచంద్రమూర్తి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు.తనకు ఇంతటి సహకారం అందించిన సిపిఎం జిల్లా కార్యదర్శి సభ్యులు ఎం అప్పలరాజుకు బంగారమ్మ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.










