Sep 14,2023 19:05

పెన్షన్లు పంపిణీ చేస్తున్న దశ్యం

ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు :అన్ని వర్గాల సంక్షేమమే ము ఖ్యమంత్రి జగన్మో హన్‌ రెడ్డి లక్ష్యమని వైసిపి నాయకులు ఇసనాక రమేష్‌ రెడ్డి, కన్వీనర్‌ ఉప్పల శంకరయ్య గౌడ్‌ పేర్కొన్నారు. మండలంలోని వర కవిపూడి సచివాలయంలో గురువారం నూతన పెన్షన్ల పంపిణీ జరిగింది. రమేష్‌ రెడ్డి, శంకరయ్య గౌడ్‌ మాట్లాడుతూ ఎపి ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం, అభివద్ధికి కట్టుబడి ఉందన్నారు. సచివా లయం ఉద్యోగులు, వైసిపి నాయకులు ఉన్నారు.