Sep 13,2023 18:50

నూతన ఫించన్లను పంపిణీ చేసిన సర్పంచ్‌ సీతారామయ్య

ప్రజాశక్తి - లింగసముద్రం :చినపవనిలో నూతనంగా మంజూరైన పింఛన్లను గ్రామ సర్పంచ్‌ దామా సీతా రామయ్య లబ్ధిదారులకు అందజేశారు. గురువారం గ్రామంలోని సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వృదాప్య ఫించన్లు 12, డప్పు కళకారుల ఫించన్లు 3,చర్మకారులు ఫించన్లు 3,వికలాంగుల పించన్లు 3,విడో ఫించన్లు 3 మంజూరైనట్లు సర్పంచ్‌ సీతా రామయ్య చెప్పారు. 24 మంది లభ్ధిదారులకు నగదును ఇచ్చారన్నారు. పంచాయితీ కార్యదర్శి సాయిప్రియ,సచివాలయం సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.