పింఛన్లు అందజేస్తున్న ఎంపి వేమిరెడ్డి
పింఛన్లు పంపిణీ
ప్రజాశక్తి-కొడవలూరు:వైసిపి జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ... కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం కొడవలూరు నూతన పింఛన్లు పంపిణీ చేశారు. తొలుత కొడవలూరులోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద ఎంపికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రసంగించారు. నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. కొడవలూరు మండలంలో నూతనంగా 350 మంది వద్ధులు, వితంతువులు, వికలాంగులు, పింఛన్లు అందించడం గొప్ప విషయమన్నారు. వలంటీర్లు, సచివాలయాల ద్వారా ప్రజల ఇంటి వద్దకే పాలన తెచ్చిన సిఎం దేశంలోనే లేరన్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే నగదు జమ చేస్తూ... అవినీతిరహిత పాలన అందిస్తున్నారని కొనియాడారు. ప్రజలకు సిఎం వైఎస్ జగన్‌పై నమ్మకం పెరిగిందని, ఇదే నమ్మకంతో 2024లో మళ్లీ సీఎంగా గెలిపించాల్సిన ఆవశ్యకతను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు ఎలా అందించారో ప్రజలందరికీ తెలుసని, ప్రస్తుతం ఎవరి సిఫార్సు లేకుండా పింఛన్లు ఎలా అందుతున్నాయో గమనించాలన్నారు. కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి, నెల్లూరు ఎంపిగా తాను గెలిస్తే.. సిఎంగా జగన్ గెలిచినట్లేనని ఎంపి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. అనంతరం నూతన పింఛన్లు మంజూరైన వారికి పింఛన్లు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బలవంతంగా పార్టీ మార్పించిన ఎంపీటీసీ ఉటుకూరు శేషమ్మకు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వైసీపీ కండువా వేసి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.










