Jan 03,2023 00:04

పింఛను పంపిణీ చేస్తున్న పాయకరావుపేట ఎమ్మెల్యే బాబూరావు

ప్రజాశక్తి- సబ్బవరం
మండలంలోని పలు గ్రామాల్లో కొత్త పింఛన్లు పంపిణీ కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. అంతకపల్లిలో ఆ గ్రామ సర్పంచ్‌ సబ్బవరపు నారాయణ మూర్తి, వైస్‌ ఎంపీపీ చొక్కాకుల గోవింద్‌ కొత్త పింఛన్లు అందజేశారు. బంగారమ్మ పాలెం గ్రామంలో సర్పంచ్‌ దాడి లావణ్య కన్నం నాయుడు, ఎంపీటీసీ రాపేటి అరుణ రాము, వంగలిలో ఎంపీటీసీ గవర తులసి రాజు, కోటిని అమ్మతల్లి నాయుడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సబ్బవరపు ముత్యాల నాయుడు, సబ్బవరపు దేముడు బాబు, గొర్లి అప్పారావు పాల్గొన్నారు.
బుచ్చయ్యపేట : మండలంలోని 35 గ్రామాల్లో వైయస్సార్‌ పెన్షన్‌ కానుకను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి దొండ రాంబాబు, వైసిపి మండల అధ్యక్షులు కొలిమిళ్ళ శివ నాయుడు, నాయకులు దాకారపు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
పరవాడ : పరవాడలో నూతనంగా మంజూరు చేసిన పింఛన్లను వైసిపి రాష్ట్ర సిఇసి సభ్యులు పైల శ్రీనివాసరావు సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ సిరపురపు అప్పలనాయుడు, ఉప సర్పంచ్‌ బండారు రామారావు, వైసిపి నాయకులు చుక్క రాము నాయుడు, వార్డు సుభ్యులు పైల హరీష్‌, పైల వెంకటరావు, పోతాల అప్పలనాయుడు, వర్రి లక్ష్మీ, పంచాయతీ కార్యదర్శులు అచ్యుతరావు, నిహారిక, సచివాలయం సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు.
కోటవురట్ల : సామాజిక పింఛన్లతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు జీవన భరోసా లభిస్తుందని కోటవురట్ల సర్పంచ్‌ అనిల్‌ కుమార్‌, నీలిగుంట సర్పంచ్‌ వరహాలబాబు తెలిపారు. సోమవారం ఆయా గ్రామాల్లో పింఛన్లు 2,750ల ఎంపీడీవో చంద్రశేఖర్‌తో కలిసి అందజేశారు. ఎంపిటిసి పివి సూర్యారావు, గ్రామ కార్యదర్శి సుబ్రహ్మణ్యం, గ్రామ కమిటీ అధ్యక్షులు సాయిబాబు పాల్గొన్నారు.
పాయకరావుపేట : రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు రూ.2,7,50లకు పెంచారని ఎమ్మెల్యే, ఏపీ అసెంబ్లీ ఎస్సీ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ గొల్ల బాబురావు తెలిపారు. మండల పరిషత్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో సోమవారం పెరిగిన పింఛన్లు అందజేశారు. పాయకరావుపేట ఎన్నికల పరిశీలకుడు చింతలపూడి వెంకట్రామయ్య, ఎంపీపీ పార్వతి, జడ్పిటిసి లంక సూర్యనారాయణ, సర్పంచ్‌ గారా ఉషశ్రీ ప్రసాద్‌, మండల పార్టీ అధ్యక్షులు దనిశెట్టి బాబురావు, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు గుటూరు శ్రీనివాసరావు, జగతా శ్రీను, ఎంపీడీవో ఏఏ సాంబశివరావు, ఈవోపిఆర్‌డి సిహెచ్‌ చంద్రశేఖరరావు పాల్గొన్నారు.
ఎస్‌.రాయవరం : మాటకు కట్టుబడి సిఎం రూ. 2750 పింఛను పెంచారని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు అన్నారు. మండలంలోని కొత్త రేవుపోలవరం గ్రామంలో కొత్త పెన్షన్లు పంపిణి చేశారు. సర్పంచ్‌ మల్లె లోవరాజు, ఎంపిడివో రామచంద్రమూర్తి పాల్గొన్నారు.
నక్కపల్లి : మండల పరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే గొల్ల బాబురావు చేతుల మీదుగా పెంచిన పింఛన్‌లు పంపిణీ చేశారు. నియోజవర్గ పరిశీలకులు చింతలపూడి వెంకట రామయ్య, ఎంపీపీ ఏనుగుపల్లి రత్నం, జడ్పిటిసి కాసులమ్మ, మండల పరిషత్‌ ఉపాధ్యక్షులు నానాజీ, ఈశ్వరరావు, ఎంపీడీవో సీతారామరాజు, పిఓపిఆర్డి వెంకట నారాయణ పాల్గొన్నారు.
గొలుగొండ : రాజకీయాలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్‌గణేష్‌ అన్నారు. సోమవారం గొలుగొండలో పింఛన్లను పంపిణీ చేపట్టారు. నర్సీపట్నం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చిటికెల బాస్కర్‌నాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపిపి గజ్జలపు మణికుమారి, వైసిపి మండల అధ్యక్షులు లెక్కల సత్యనారాయణ, వైస్‌ ఎంపిపిలు సుర్ల ఆదినారాయణ, జక్కు నాగమణి, మండల మహిళా ధ్యక్షురాలు లోచల సుజాత, మండల యూత్‌ అధ్యక్షులు రామకృష్ణనాయుడు, తహశీల్దార్‌ ఆనందరావు, ఎంపిడిఒ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.