Sep 10,2023 23:57

ప్రజాశక్తి - పర్చూరు
మండలంలోని నాగులపాలెంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రోటరీ అనుబంధ సంస్థ కమ్యూనిటీ క్రాప్స్ చే ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌కు రూ.7లక్షల అంచనాతో ఫిల్టర్ బెడ్, సంపు నిర్మాణానికి ఆదివారం భూమి పూజ ఎన్నారై ముద్దన హరిబాబు, క్లబ్ అధ్యక్షుడు నాగభైరు శ్రీనివాసరావు చేశారు. ఫిల్టర్ బెడ్ ఎర్పాటుతో వాటర్ ప్లాంట్‌కు నిరంతరంగా నీరు లభ్యమవుతాయని తెలిపారు. రోటరీ సభ్యుల పూర్తి ఆర్థిక సహాయంతోపాటు దాతలు నుండి సేకరించిన విరాళంతో అధునాతనంగా ఈ ఫిల్టర్ బెడ్ నిర్మిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌సిసి అధ్యక్షుడు చాగంటి నాగేశ్వరావు, సభ్యులు కొల్లా శ్రీనివాసరావు, కొల్లా శివరామకృష్ణ, కొల్లా నరేంద్ర కుమార్, ఆర్‌సిసి డైరెక్టర్ తేళ్ల రమేష్ చంద్ర, రోటరీ క్లబ్ కార్యదర్శి పంబి సదానందరెడ్డి, కోమటి ఆంజనేయులు, పాబోలు వెంకన్న, పోలిశెట్టి చంద్రం, భవనం రాజగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.