May 15,2023 00:14

 తాడేపల్లి: పిల్లలు ప్రశ్నించే తత్వం అలవర్చు కోవాలని మంగళగిరి,తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి గాదె సుబ్బారెడ్డి కోరారు. తాడే పల్లి చిల్డ్రన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి గురువారం వరకు ఐదు రోజుల పాటు జరుగుతున్న సమ్మర్‌ క్యాంపును తాడేపల్లి మేకా అమరారెరడ్డి భవన్‌లో ఆది వారం ఆయన ప్రారంభించారు. ఈ సంద ర్భంగా జరిగిన సభకు ఆర్‌టిసి విశ్రాంత ఉద్యోగి భీమవరపు దశరధరామిరెడ్డి అధ్య క్షత వహించారు. ముందుగా వక్తలను చిల్డ్రన్స్‌ క్లబ్‌ అధ్యక్షులు సోలా ముత్యాల రావు వేదిక వైకి ఆహ్వానించారు. ఈ సంద ర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ మారు తున్న సమాజానికి అనుగుణంగా ఎప్పట ికప్పుడు జరుగుతున్న విషయాలను పిల్లలు తెలుసుకోవాల్సిన అవసరముందన్నారు. క్లాస్‌ పుస్తకాలే కాకుండా చరిత్రకు సంబం ధించిన పుస్తకాలు చదవాలని,అందుకు గ్రంథాలయాలను వినియోగించుకోవాలని చెప్పారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎందరో మహానుభావులు తమజీవితాలను తృణప్రాయంగా అర్పించి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారన్నారు. 200 ఏళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బ్రిటీష్‌ రాజ్యాధాకారాన్ని అహింసా మార్గంలో గాంధీజీ పోరాడి స్వాతంత్య్రాన్ని తీసు కొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. స్వాతంత్య్ర పోరాటంలో ఏ ప్రాత లేని, బ్రిటీష్‌ వారి దగ్గర క్షమాభిక్ష కోరి పొర్లు దండాలు పెట్టిన పాలకులు నేడూ ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్ల దొరలను ఎదిరించి గుంటూరు జిల్లాలో (పల్నాడు జిల్లా) స్వాతంత్య్ర పోరాటంలో ప్రపథమంగా బ్రిటీష్‌ తూటాలకు నేల కొరిగిన కన్నెగంటి హనుమంతు పాఠ్యాంశాన్ని తొలగించడాన్ని ఆక్షేపిం చారు. మహాత్మా గాంధీకి సంబంధించిన కొన్ని అంశాలను పాఠ్యాంశాల్లో తొలగించ డంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థులు క్షుణ్ణంగా ప్రతీ విషయాన్ని గమనించి ముందుకు సాగాల్సిన అవసర ముందన్నారు. మొదటిరోజు సుమారు 40 మంది పిల్లలు సమ్మర్‌ క్యాంపుకు హాజ రయ్యారు. డ్రాయింగ్‌, క్రాఫ్ట్‌, సైన్స్‌ సంగ తులు, ఆడలాడుకుందాం, పాటలు పాడు కుందాం, కథలు చెప్పుకుందాం అనే అంశాలపై ఐదు రోజులు పాటు శిక్షణ జరగనుంది. మొదటి రోజు పద్మావతి టీచర్‌ నీతికథలు, దేశ నాయకుల జీవిత విశేషాలను వివరించారు. కోటేశ్వరరావు మాష్టారు సైన్స్‌ విశేషాలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి జిల్లా నాయకులు ఆర్‌వి రాఘవయ్య, కొండల ప్రసాద్‌, తాడేపల్లి చిల్డ్రన్స్‌ క్లబ్‌ నిర్వాహకులు వై.బర్నబస్‌ పాల్గొన్నారు.