Jun 27,2023 21:29

మాట్లాడుతున్న జడ్జి ఎం. ప్రదీప్‌కుమార్‌మాట్లాడుతున్న జడ్జి ఎం. ప్రదీప్‌కుమార్‌

 కడప : పిల్లలు సత్ప్ర వర్తనతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, డిఎల్‌ఎస్‌ఎ సెక్రటరీ ఎం. ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం కడప నగరంలోని చిన్న చౌక్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను జడ్జి సందర్శించారు. అక్కడ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. పిల్లలకు అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి అని సూచించారు. వంట, వసతి, తరగతి గదులను పరిశీ లించారు. పిల్లల విద్యా , ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు వహిం చాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.