పిల్లలు నిత్య విద్యార్థులుగా ఉంటే
లక్ష్య సాధన సులభం
ప్రజాశక్తి-తిరుపతి(మంగళం):
నేటి తరం విద్యార్థులు సామాజిక బాధ్యతను, స్పహను అలవర్చుకోవడంలో ఏర్పడిన అవాంతరాలను తిరుపతి బాలోత్సవం పిల్లల పండుగ దూరం చేసి విద్యార్థులకు కనుమరుగవుతున్న కలలను, మనోవికాసాన్ని కలిగించిందని బాలోత్సవం ముగింపు కార్యక్రమంలో కస్తూర్బా ఛైర్మన్ పిసి రాయల్, పారిశ్రామికవేత్త కేవీ చౌదరి, నగరపాలక సంస్థ 1 డివిజన్ కార్పొరేటర్ ఆదం రాధాకష్ణారెడ్డిలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. తిరుపతి ఎస్పీ జేఎన్‌ఎమ్ పాఠశాల వేదికగా రెండు రోజులపాటు తిరుపతి బాలోత్సవం- పిల్లల పండుగ పేరుతో నిర్వహించిన కార్యక్రమం విద్యార్థుల తల్లిదండ్రుల్లోగాని, విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని రేకెత్తించింది. పిల్లల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడానికి 23 అంశాలపై 41 విభాగాల్లో పోటీలను నిర్వహించారు. ఎంతో ఉత్సాహంగా సాగిన తిరుపతి బాలోత్సవంలో దాదాపు 99 పాఠశాలల నుండి వందల మంది విద్యార్థులు తమలో ఉన్న నైపుణ్యాన్ని, క్రీడలు, జానపద కళలు, కథలు, చిత్రలేఖనం, బొమ్మల తయారీ ఇలా చాలా అంశాలలో ఆసక్తిగా పాల్గొని తమలో ఉన్న సజనాత్మకతను వెలికితీసి తోటి విద్యార్థులతో పోటీపడ్డారు. ఎంతో కార్యచరణతో నిర్వహించిన తిరుపతి బాలోత్సవంలో న్కెపుణ్యతను, సజనాత్మకతతో పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు న్యాయ నిర్ణేతలు మార్కులు దిద్దారు. పిల్లలను ప్రోత్సహిస్తూ చేసిన కషికి బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో గౌరవ సన్మానం చేసి జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో మోహన్ రాజ్, ఎస్పీ జేఎన్‌ఎం ప్రధానో పాధ్యాయులు గుణశేఖర్, బాలోత్సవ కమిటీ నిర్వహకులు మల్లారపు నాగార్జున ,సభ్యులు, కే ముత్యాల రెడ్డి, యూటిఎఫ్ నాయకులు బండి మధుసూదన్ రెడ్డి, అవనిగడ్డ పద్మజ, మోహన్‌మూర్తి, ఆమూరి సుబ్రహ్మణ్యం, పేరూరు బాలసుబ్రమణ్యం, బి.యన్.రెడ్డి సాకం నాగరాజు, యువశ్రీ మురళి తదితరులు పాల్గొన్నారు.










