ఫొటో : మాట్లాడుతున్న ఎంఇఒ మస్తాన్‌వలీ
పిల్లలు బడిలో చేరాలి
ప్రజాశక్తి-సీతారామపురం : చదువు మానుకొని ఇంటి వద్ద ఉంటున్న పిల్లలు పాఠశాలలో చేరాలని ఎంపిడిఒ రంగ సుబ్బరాయుడు, ఎంఇఒ మస్తాన్‌వలీలు పేర్కొన్నారు. సోమవారం సీతారామపురం బిట్-2 పరిధిలో గ్రాఫ్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 5 సంవత్సరాలు నుండి 18 సంవత్సరాల వరకు పిల్లలు పాఠశాలల్లో ఉండాలన్నారు. సీతారామపురం బిట్-2 పరిధిలో బడిబయట విద్యార్థులను ఐదుగురిని గుర్తించామని వారిని పాఠశాలల్లో చేరే విధంగా అవగాహన కల్పించామన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జీవన్, డిజిటల్ అసిస్టెంట్ నాగరాజు, వలంటీర్లు పాల్గొన్నారు.










