Aug 27,2023 21:17

శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్జి ప్రదీప్‌కుమార్‌

 కడప : పిల్లలను సరైన మార్గంలో నడిపించే బాధ్యత తల్లిదండ్రులదే అని అడిషనల్‌ సీనియర్‌ సివిల్‌ జడ్జి, జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎం. ప్రదీప్‌ కుమార్‌ పేర్కొన్నారు. బాలల చట్టాల అవగాహన కార్యక్రమాలలో భాగంగా ఆదివారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత శాఖ ఆధ్వర్యంలో పెన్నార్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ఉన్నటువంటి చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్లు, ఎఎస్‌ఐలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన జడ్జి మాట్లాడుతూ ప్రస్తుతం టెక్నాలజీ సోషల్‌ మీడియా వంటివి పిల్లలపై ప్రభావాన్ని ఎక్కువగా చూపుతున్నాయని, తల్లి దండ్రులు జాగ్రత్త వహించాలని, పిల్లలకి మంచి చెడులను చెప్పినప్పుడే వారు సరైన మార్గంలో నడుస్తారని అన్నారు. 18 సంవత్సరాలు లోపు ఉన్నటువంటి పిల్లలు ద్విచక్ర వాహనాన్ని నడిపినట్లు అయితే పోలీసులు అటువంటి వారిపై కేసు నమోదు చేయడంతో పాటు ద్విచక్ర వాహన యజమాని పై కేసు నమోదు చేయడం ద్వారా వారిలో మార్పు తీసుకు రావచ్చు అని తెలియజేశారు.విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ, సాధికారత అధికారి డి. శ్రీలక్ష్మి మాట్లా డుతూ బాలలకు రక్షణ కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తునా ్నమని అన్నారు. పిల్లలకు సంబంధించినటువంటి విషయాలు పోలీస్‌ స్టేషన్‌ వరకు వచ్చినప్పుడు ఎలాంటి పద్ధతులు పాటి ంచాలి, పిల్లల కోసం ఉన్నటువంటి చట్టాలు, వ్యవస్థల గురించి అవగాహన కల్పించడం కోసం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఉన్న టువంటి చైల్డ్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ బాల్య వివాహ నిరోధక అధికారిగా ఉంటారని తెలియజేశారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి బి.ఆర్‌. సుబాష్‌ యాదవ్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా బాలల కొరకు పనిచేస్తున్నటువంటి వ్యవస్థలను, బాలల చట్టాల గురించి వివరించారు. కార్యక్రమంలో కడప జిల్లా దిశ సిఐ, ఎస్‌ఐతోపాటు జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లలోని అధికారులు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.