ప్రజాశక్తి- సంతమాగులూరు : బడి బయట ఉన్న పిల్లల వివరాలను వాలంటరీల ద్వారా సేకరించి వారు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఎంపిడిఒ సాంబశివరావు తెలిపారు. మండల విద్యా వనరుల కేంద్రంలో స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యా యులకు నాన్ అకాడమిక్ పనుల నిర్వహణ, పర్యవేక్షణపై సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఇఒ మాట్లాడుతూ వేమవరపు కోటేశ్వరరావు మాట్లాడుతూ పాఠశాల పరిసరాలు, మరుగు దొడ్లు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కానిసిస్ టెంట్ రిథమ్ యాప్‌లో టికెట్స్ సకాలంలో పరిష్కరిం చాలన్నారు. పాఠశాలకు గైర్హాజరైన విద్యార్థుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేసి వారు ప్రతిరోజు పాఠశాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎపిఎం డి.మస్తాన్ రావు, ప్రధానోపాధ్యాయులు ప్రసాదరావు, దారా బాలయ్య, ఆనంద్ కుమార్, సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.










