తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్న ఆచార్యులు
ప్రజాశక్తి- నక్కపల్లి:పాఠశాలకు క్రమం తప్పకుండా పిల్లలు పంపించాలని నక్కపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు ఎన్ వి ఎస్ ఆచార్యులు అన్నారు.మండలంలోని ఉపమాక పంచాయతీ సారిపల్లివానిపాలెం లో బుధవారం స్కూలుకు రాని విద్యార్థుల ఇళ్లకు వెళ్లి మాట్లాడారు. పిల్లలను ప్రతిరోజు స్కూలుకు ఎందుకు పంపించ లేదని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో విద్యార్థులు హాజరు, ప్రగతి వివరించారు. పిల్లలు ప్రతిరోజు స్కూలుకు రాకపోతే చదువులో వెనకబడతారని సూచించారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు క్రమం తప్పకుండా పిల్లలను స్కూలుకు పంపించాలన్నారు.










