Aug 30,2023 22:34

ప్రజాశక్తి - మండవల్లి
            విద్యకు దూరమైన విద్యార్థులు పాఠశాలల్లో, కళాశాలల్లో చేరి విద్యను అభ్యసించడానికి మిషన్‌ గ్రాస్‌ ఎన్రోల్‌మెంట్‌ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని జూనియర్‌ కళాశాల ప్రిన్సిపల్‌ జి.సుధాకర్‌ తెలిపారు. కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు విద్యకు దూరమైన విద్యార్థులను గుర్తించే కార్యక్ర మాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్‌ జి.సుధాకర్‌ మాట్లాడుతూ పాఠశాల, కళాశాల ఈడు పిల్లలంతా పాఠశాలలో, కళాశాలలో ఉండి విద్యను అభ్యసించాలన్నారు. అనంతరం అయ్యవారి రుద్రవరం గ్రామంలో పర్యటించి విద్యకు దూరమైన విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో, కళాశాలలో చేర్పించి విద్యాభివృద్ధి సాధించేలా సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు .ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్‌, ప్రభయ్య, శివకుమారి, మైనర్‌ బాబు, కిరణ్‌కుమార్‌, బాబా సుబ్రహ్మణ్యం, దివాకర్‌ పాల్గొన్నారు.