ప్రజాశక్తి - తాడేపల్లి : మ్యాజిక్ విషయాల్లో తాను నేర్పించిన దాని కంటే పిల్లల ఆలోచనా శక్తి పెరిగిందని, క్రియేటివిటీగా ఆలోచిస్తున్నారని ప్రఖ్యాత ఇంద్రజాలికులు క్రాంతికార్ హర్షం వ్యక్తం చేశారు. నాలుగు రోజులుగా జరుగుతున్న మ్యాజిక్ శిక్షణా శిబిరంలో హాజరైన చిన్నారుల నుంచి ఆయన గమనించిన విషయాలను వారి దృష్టికి తీసుకొచ్చారు. తాను చేస్తున్న మ్యాజిక్ విషయాల కంటే పిల్లలు అదనంగా విభిన్నంగా కొత్తదనంగా ప్రదర్శించి తనకు ఉత్సాహాన్ని తెస్తున్నారని అన్నారు. సోమవారం శిక్షణలో పేపర్ చార్ట్ ఖాళీగా చూపించి దాన్ని ట్యూబులాగా చుట్టి అందులోంచి పూలదండ తెప్పించారు. బుద్ద ఆఫ్ మిస్టరీ మ్యాజిక్ శిక్షణలో పది రూపాయల నోటు వంద రూపాయల నోటుగా మార్చి అందరినీ ఆశ్చర్యచితుకులను చేశారు. మొత్తం పది రోజుల శిక్షణలో ఏడు రోజుల పాటు వచ్చే గురువారం వరకు తాను కొన్ని మ్యాజిక్ అంశాలు నేర్పిస్తానని, శుక్రవారం నుంచి ఆదివారం మూడ్రోజులపాటు మ్యాజిక్‌ను విద్యార్థులే స్వయంగా చేసేలా శిక్షణిస్తామని తెలిపారు.










