ఖాజీపేట : పిల్లలకు టీకాలే ఆరోగ్య రక్ష అని డిఎంహెచ్‌ఒ నాగరాజు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పుల్లూరు సచివాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహిస్తున్న మిషన్ ఇంద్ర ధనుష్, డాక్టర్ వైఎస్ ఆర్ కంటివెలుగు కార్యక్రమం, డాక్టర్ వైఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ కార్యక్రమాలను ఖాజీపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ డాక్టర్ ఎస్.ముబీన్‌తో కలిసి డిఎంహెచ్‌ఒ పర్యవేక్షించారు. శనివారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో పుల్లూరు సచివాలయంలో ఆయన అమలవుతున్న కార్యక్రమాలను గురించి గర్భిణులు, బాలింతలు, అవ్వతాలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ గర్భిణులు ప్రత్యేకంగా ప్రధాన మంత్రి సురక్షిత మాతత్వ అభియాన్ కార్యక్రమం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తోందని చెప్పారు. గర్భిణులకు పరీక్షలు, మందులు, అవసరం అయిన వారికి చికిత్సలు అందిస్తారని తెలియజేశారు. 108 అంబులెన్సు వాహనం,104 సంచార వాహనం, తల్లీబిడ్డల ఎక్స్‌ప్రెస్ వాహనాలను ఉపయోగించుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. డాక్టరు వైఎస్ ఆర్ కంటివెలుగులో భాగంగా అవ్వ తాతలకు కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి కంటి అద్దాలు, ఇంకా అవసరం కంటి ఆపరేషన్ చేయించాలని కంటివెలుగు డాక్టర్‌కు సూచించారు. డాక్టర్ వైఎస్ ఆర్ హెల్త్ క్లినిక్‌లో అన్ని జబ్బులకు, మందులు నిల్వ ఉండాలని ఆయన సిహెచ్‌ఒలకు పేర్కొన్నారు. చిన్నారుల తల్లులను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు గర్భం ధరించినప్పట ినుండి కాన్పు అయ్యే వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గర్భం వచ్చిన తరవాత మూడు సార్లు గర్భ వాయువు రాకుండాసూదులు వేయించుకోవాలని, కాన్పుకు ప్రభుత్వాస్పత్రికి వెళ్లి సుఖ ప్రసవం పొందాలన్నారు, ప్రభుత్వాస్పత్రిలో అన్ని రకాల వసతులున్నాయని ఆయన మహిళలకు తెలియజేశారు. వాక్సిన్ పెట్టెను, అందులోని టీకాల మందులను పరిశీలించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వచ్చేది వర్షా కాలం కాబట్టి, నీటి ద్వారా వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే ప్రభుత్వఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని వారికి సూచించారు. ఈ నెల 17న విద్యార్థులకు తప్పక అల్బెండ్ జోల్ మాత్ర లను వేయాలన్నారు. దోమల ద్వారా వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలని చెప్పారు. ఆయన వెంట యం.వి.వి ప్రసాద్, కెఎస్‌వి ప్రసాద్ పాల్గొన్నారు.










