జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్
ప్రజాశక్తి- కశింకోట
పిల్లలకు నులి పురుగుల నివారణ మాత్రలు వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ హేమంత్ అన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ వారోత్సవాలు సందర్భంగా కశింకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో మంగళవారం నులి పురుగులు మాత్రలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు పాటించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య సేవలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కశింకోట వైద్య అధికారులు తిరుపతిరావు, యశోద పాల్గొన్నారు.
అనకాపల్లి : స్థానిక భీముని గుమ్మం జీవీఎంసీ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను ఎలమంచిలి ఉపవిద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ధర్మారావు, ఎంఈఓ దివాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి పాల్గొన్నారు.










