ప్రజాశక్తి - శ్రీకాకుళం: పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక దృష్టిసారించాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్‌లో జువెనైల్ జస్టిస్ యాక్ట్ సభ్యులకు శుక్రవారం నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. తల్లిదండ్రులు వ్యక్తిగత బాధ్యత వహించి పిల్లల ప్రవర్తనను గమనిస్తూ ఉండాలని సూచించారు. కేసులు పర్యవేక్షించే వాళ్లు చట్టంతో విభేదించడానికి గల కారణాలను శోధించి లోతైన అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పిల్లలు చట్టంతో విభేదించకుండా నిరోధించడానికి సూచనలు చేయాలని కోరారు. సమావేశంలో ఎస్‌పి జి.ఆర్ రాధిక, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, జువైనల్ జస్టిస్ యాక్ట్ జస్టిస్ బోర్డ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ శారదాంబ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ శ్రీలక్ష్మి, డిఇఒ కె.వెంకటేశ్వరరావు, జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి కె.ప్రకాశరావు, జిల్లా బాలల సంరక్షణ అధికారి రమణ తదితరులు పాల్గొన్నారు.










