
ప్రజాశక్తి - వేటపాలెం
స్థానిక పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న పిల్లల పార్కు నందు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టవద్దంటూ స్థలదాత వారసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టేందుకు విద్యుత్ శాఖ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో సిబ్బంది బుధవారం పనిచేస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థలదాత వారసులు పిల్లల పార్కులో ట్రాన్స్‌ఫార్మర్ పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ శేఖర్ ఏమైనా ఉంటే విద్యుత్ ఏడి, ఏఈలను సంప్రదించాలని సూచించారు. గతంలో కూడా ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్ పెట్టే ప్రయత్నం చేస్తే కలెక్టర్ ఫిర్యాదు చేసినట్లు పరణం అంజన్న నాయుడు తెలిపారు. పనులను ఆపేది లేదంటూ విద్యుత్ శాఖ అధికారులు తేల్చి చెప్పడంతో ఆయన ఫిర్యాదు చేశారు.