Jul 31,2022 23:15

సభ్యత్వ కార్డులు అందిస్తున్న టిడిపి నాయకులు

   ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి 7వ వార్డు పరిధి పిలకవానిపాలెంలో తెలుగుదేశం వార్డు అధ్యక్షులు పిళ్లా నర్సింగరావు ఆధ్వర్యాన ఆదివారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 7వ వార్డు టిడిపి కార్పొరేటర్‌ పిళ్లా మంగమ్మ, జిల్లా వాణిజ్య విభాగ కార్యవర్గ సభ్యులు పిళ్లా వెంకటరావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు కార్యక్రమానికి విశేష స్పందన వస్తుందని, గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలామంది సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారని తెలిపారు. సభ్యత్వ నమోదును అధికంగా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు పార్టీ ప్రధాన కార్యదర్శి కానూరి అచ్యుతరావు, సీనియర్‌ నాయకులు నాగోతి సూర్యప్రకాష్‌, పోతిన బుజ్జి, పోతిన నాయుడు, పిళ్లా రాము, సోంపాత్రుడు తదితరులు పాల్గొన్నారు.