Oct 31,2023 23:34
పాఠశాలకు బీరువా, కుర్చీని అందజేస్తున్న పూర్వ విద్యార్థులు

ప్రజాశక్తి-పిసిపల్లి: పిసి పల్లి జడ్పీ హైస్కూల్‌కు 1991-1992 సంవత్సరంలో 10వ తరగతి చదివి ఉన్న విద్యార్థులు బీరువా కుర్చీని మంగళవారం బహూకరిం చారు. ఈ సందర్భంగా మీనిగ మధుసూదన్‌రావు మాట్లాడుతూ తాము చదివిన పాఠశాలకు తమ చేతనైనంతవరకు సహాయం అందిస్తామని తెలిపా రు. ఈ కార్యక్రమంలో హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు డేగ ఆంజనేయులు ఉపాధ్యాయులు ఎం నరసింహారావు, వై తిరుపతయ్య, పూర్వ విద్యార్థులు లోమడి తిరుపతిరావు, కె చినబాబు, జి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డేగ ఆంజనేయులు మాట్లాడుతూ పాఠశాలలో చదివిన విద్యార్థులు పాఠశాలకు బీరువా, కుర్చీని, బహుకరించి అభివృద్ధికి తోడ్పడటం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా పాఠశాలలు చదివి ప్రయోజకులైన వారు తమ శక్తి మేరకు తమ చదువుకున్న పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. ఈ విధంగా అప్పటి పదో తరగతి విద్యార్థులు అభివద్ధికి కృషి చేయడం అభినందనీయమని ఆయన అన్నారు.