పీసీఓఎస్, పీసీఓడిపై అవగాహన సదస్సు
ప్రజాశక్తి -కోట : కోట మండలం విద్యానగర్ లోని ఎన్ బీకే ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం మహిళా సాధికారత సెల్ ఆధ్వర్యంలో, కళాశాల డైరక్టరు డాక్టర్ విజయ కుమార్ రెడ్డి సూచలన మేరకు పీసీఓఎస్, పీసీఓడి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమానికి కోట ప్రభుత్వ ఆసుపత్రి పి. రూప గైనకాలజిస్ట్ ముఖ్య అతిథిగా విచ్చే శారు. ఈ సందర్భంగాఆమె మాట్లాడుతూ పీసీఓసీ, పీసీఓడి గల కారణాలు, సమస్యను ఎలా గుర్తించ వచ్చు, ఏవిధంగా ఈ సమస్యను అధిగమించ వచ్చు అనే విషయాలు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని విద్యార్థినులు చక్కగా తమ సమస్యలను డాక్టరుకి వివరించి, సలహాలు, సూచన లను తీసుకున్నారు. ముఖ్యంగా ఈ సమస్యతో బాధ పడే విద్యార్థినులు చక్కటి ఆహార అలవాట్లతో, క్రమం తప్పని వ్యాయమంలో మంచి ఫలితాలను పొంద వచ్చని డాక్టర్ రూప తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ డాక్టర్ విజయకుమార్ రెడ్డి, మహిళా సాధికారత సెల్ కోర్డినేటర్స్ డాక్టర్ యస్. ఇందువతి, డాక్టర్ బి.వాసరి, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.










